ETV Bharat / state

Crops Drying Due to Lack of Irrigation: సాగునీరు అందక ఎండుతున్న పంటలు.. ఆత్మహత్యలే శరణ్యమంటున్న అన్నదాతలు - రైతులు

Crops Drying Due to Lack of Irrigation Water: వైసీపీ రైతు ప్రభుత్వమని, తాను పేదల పక్షపాతినని.. ప్రతి సభలోనూ సీఎం జగన్‌ ఊదరగొడతారు. కానీ వాస్తవమేమిటంటే.. జగన్‌ సర్కార్ రైతులకు సరైన సమయానికి సాగునీరు అందించలేక పోతోంది. దీంతో సాగు నీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేయాలని మొర పెట్టుకుంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Crops_Drying_Due_to_Lack_of_Irrigation
Crops_Drying_Due_to_Lack_of_Irrigation
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 11:50 AM IST

Crops Drying Due to Lack of Irrigation: సాగునీరు అందకపోవడంతో ఎండుతున్న పంటలు.. ఆత్మహత్యలే శరణ్యమంటున్న అన్నదాతలు..

Crops Drying Due to Lack of Irrigation: అవసరమైన సమయంలో పొలాలకు సాగునీరు అందకపోవడంతో.. కృష్ణాజిల్లాలోని రైతుల పరిస్థితి.. అగమ్యగోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా రైతులు.. ఎంటీయూ 13-18, 12-24, 10-61, 12-62, 70-29 బీపీటీ 52-04, పీఎల్ఎ 11-00 వంటి వరి వంగడాలను ఎక్కువగా సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉంది. ఇలాంటి సమయంలో సాగునీరు కొరత ఏర్పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నీటి విడుదలలో వారబంధి అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. పొలాలకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ముందస్తు ప్రణాళిక లోపంతోనే.. తమకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గుడివాడ, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల ఆయకట్టు సాగునీరు లేక పూర్తిగా ఎండిపోతుంది. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని రైతులు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది.

Water shortage in Krishna Western Delta కంటతడి చూడండంటూ రోడ్డెక్కిన అన్నదాతలు... పట్టించుకోని ప్రభుత్వం..!

డోకిపర్రు, పెసరమిల్లి, కౌతవరం, గుడ్లవల్లేరు, పసుభొట్లపాలెం గ్రామాల్లో వందల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరు లేక పొలాలన్నీ నెర్రలిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజురోజకీ తగ్గుతుందని.. ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంబిస్తే.. రానున్న రోజుల్లో రైతులను ప్రదర్శనశాలల్లో చూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కవ శాతం కౌలు రైతులే ఉన్నారు.

Farmers Agitation with Holding Pesticide: పంటలు ఎండిపోతే మరణమే.. పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడంలేదని వాపోతున్నారు. ఈనిక దశలో వరిపైరు నీరు లేక నాశనమైపోతే.. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాలువల పరిశీలనకు అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు.. తప్ప సాగు నీరు మాత్రం అందించడం లేదని వాపోతున్నారు. ఎకరాకి సుమారు 25 వేల రూపాయల వరకు ఖర్చు చేశామని.. ఇప్పుడు అధికారులు నీరివ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి.. కంటికి రెప్పలా చూసుకుంటున్న పంట.. కళ్ల ముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరు అందించి తమని ఆదుకోవాలని మొర పెట్టుకుంటున్నారు.

Crops are Drying up Due to Lack of Water: సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు.. కాపాడుకోవటానికి రైతన్న తంటాలు

"అవసరమైన సమయంలో పొలాలకు సాగునీరు అందకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కాలువల పరిశీలనకు అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు.. తప్ప సాగు నీరు మాత్రం అందించడం లేదు. ఎకరాకి సుమారు 25 వేల రూపాయల వరకు ఖర్చు చేశాం. ఇప్పుడు అధికారులు నీరివ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం. బంగారం తాకట్టు పెట్టి, అప్పులు చేసి.. కంటికి రెప్పలా చూసుకుంటున్న పంట.. కళ్ల ముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరు అందించి మమ్మల్ని ఆదుకోవాలి." - రైతులు

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంట.. ఉరితాళ్లతో రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.