కృష్ణా జిల్లాలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడలో పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు మిన్నంటాయి. ప్రజలు కుటుంబసమేతంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేవదేవుని సన్నిధిలో ఫాదర్స్ ప్రత్యేక ప్రార్థనలు జరిపి బాల ఏసు ఆశీర్వచనాలు అందించారు. గుణదలతోపాటు వన్ టౌన్ లోని సెయింట్ పాల్స్ సెంటినరీ చర్చ్, సత్యనారాయణ పురంలోని ఆరోగ్య వేళంగణి మాత చర్చి, రైల్వే స్టేషన్ రోడ్డులోని క్యాథడ్రల్ చర్చిలను అందంగా ముస్తాబు చేశారు .
కుల మతాలకతీతంగా...
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంకలో పెద్దదైనా ఆర్సీయం దేవాలయం వద్ద అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ఏర్పాటు చేసారు. క్రైస్తవులే కాకుండా ఇక్కడ హిందువులు సైతం ఏసుప్రభువును పూజించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. అన్నప్రాశనలు, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలతో పాటు తలనీలాలు కూడా ఇక్కడే సమర్పిస్తారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్