విజయవాడలో ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొగల్రాజపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఈ ముఠా బెట్టింగ్ నిర్వహిస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు నిందితుల్నిఅరెస్ట్ చేశారు. వారంతా తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
'అవతార్' అనే యాప్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ కోసం వినియోగించిన లైన్ బాక్స్, 25 సెల్‌ఫోన్స్, ఎల్సీడీ మానిటర్, లాప్టాప్లను స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశాం. ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటాం. రూ.12 లక్షల వరకు బెట్టింగ్ జరిగిందని సమాచారం ఉంది. బెట్టింగ్‌పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలి. విద్యార్థులు బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దు' అని డీసీపీ తెలిపారు.
ఇవీ చదవండి..