అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని విస్మరించారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగులతో కలిసి ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు.
మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తున్నామన్న ముఖ్యమంత్రి జగన్... తన వ్యాఖ్యలకు కట్టుబడి సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: