విజయవాడలో వివిధ రకాల షాపుల్లో పని చేస్తున్న 12 మంది గుమస్తాలు.. కరోనా కారణంగా చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ సొమ్ముతోపాటు అధికంగా ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు.
కరోనాతో చనిపోయిన కార్మిక కుటుంబాల పిల్లలను ఆదుకోవాలన్నారు. కొవిడ్‌కు గురైన వారు 15 నుంచి 20 రోజులు విధులకు రాలేని పరిస్థితి ఉందని.. అందువలన ప్రభుత్వం పూర్తి జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు యాజమాన్యం సైతం అండగా నిలవాలని సూచించారు.
ఇవీ చూడండి: