కృష్ణా జిల్లా నందిగామ మండలంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. పల్లగిరి గట్టు వెనుక భాగంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని నాయకులు ఆగ్రహించారు.
సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ మైనింగ్ అధికారులకు అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కె. గోపాల్. మండల కమిటీ సభ్యులు సయ్యద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: