విజయవాడ కబేళా సెంటర్ సమీపంలో రహదారులను బాగు చేయాలని కోరుతూ సీపీఐ, తెదేపా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కబేళా సెంటర్లోని రోడ్లు పూర్తిగా దెబ్బతినటంతో... స్ధానికులు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని... ప్రధాన రహదారులే ఇలా ఉండటం దారుణమని సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారులపై ప్రజలు ప్రాణాలు వదులుతుంటే మంత్రి వెల్లంపల్లి పట్టించుకోక పోవటం భాధ్యతారాహిత్యం అని తెదేపా నాయకులు మైలవరపు కృష్ణా అన్నారు. స్పెషల్ అధికారి పాలనలో ఉన్న నగర పాలక సంస్ధ అధ్వాన్నంగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. వెంటనే రోడ్ల మరామ్మత్తులు జరగకుంటే దశలవారిగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ...'కరోనా' కథ మార్చేనా..! ట్రంప్‌కు వైరస్ సోకడంపై సర్వత్రా చర్చ