గ్రామ సచివాలయాలు అధికార పార్టీ కమిటీలుగా మారే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. 90 శాతం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోందన్నారు. సచివాలయ ఉద్యోగ నియామకాల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సచివాలయ అభ్యర్థుల్లో అనుమానాలు నివృత్తి చేయాలన్నారు.
ఇదీ చూడండి: 'ఎంపీఈవోలను గ్రామ సచివాలయంలోకి తీసుకోవాలి'