సినీ నటుడు రామ్ ట్వీట్ పెడితే ఆయనకు నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడం విన్నాను కానీ... ఇప్పుడు న్యాయమూర్తుల ఫోన్ లు కూడా ట్యాప్ చేయడం చూస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఇంతకన్నా దారుణం మరొకటి లేదని... విజయవాడలో వైకాపా నాయకుడు పట్టపగలు కిరోసిన్ పోసి హత్యాయత్నం చేస్తే పోలీసులు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. పోలీసులంటే అధికార పార్టీ నాయకులకు లెక్కేలేదని ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: