ETV Bharat / state

రీ-నోటిఫికేషన్ ఇవ్వండి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

గతేడాది ఇచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్​ను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేశారు.

cpi ramakrishna meet sec
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Apr 1, 2021, 7:39 PM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్​ను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్​ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీపీఐ కోరింది. విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్​ నీలం సాహ్నిని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు.

గతంలో 126 జడ్పీటీసీ, 2300 ఎంపీటీసీలను వైకాపా నేతలు దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా ప్రజాస్వామ్య యుతంగా జరపాలంటే రీ-నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఏడాది క్రితం నామినేషన్లు వేసిన వారిలో కొందరు చనిపోయారని.. తాజాగా నోటిఫికేషన్ వేసి నామినేషన్లు స్వీకరించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

ఆ అబ్బాయి అంధుడు.. అయితేనేం.. ప్రేమించింది పెళ్లి చేసుకుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.