విజయవాడలోని దాసరి భవన్ వద్ద సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. లాక్ డౌన్ కాలంలోని విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన విధంగా 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పనుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. రెండు నెలల కాలం బిల్లుల్ని ఒకే బిల్లుగా ఇచ్చి రెట్టింపు స్లాబ్ రేట్లను వినియోగదారులపై మోపుతున్నారని నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆరోపించారు. కొత్త టారిఫ్ అమలును నిలుపుదల చేయాలనీ.. లాక్డౌన్ కాలం బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
ఇది చదవండి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అధికారుల నియామకం