విజయవాడలో రహదారుల నిర్వాహణ, పారిశుద్ధ్యం, విషజ్వరాల వ్యాప్తిని అరికట్టడంలో నగరపాలక సంస్థ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ, నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ ధర్నా కు దిగింది. దేశంలోనే పారిశుద్ద్యంలో అగ్రస్థానంలో ఉన్న విజయవాడను, అధికార్లు అధమస్థాయికి తీసుకొచ్చారని సీపీఐ నేతలు ఆరోపించారు. రోడ్లపై ఎక్కడ చూసిన బురద, చెత్తా దర్శనమిస్తున్నాయని, పాతబస్తీ రోడ్ల దుస్థితి భయంకరంగా మారిందని నేతలు మండిపడ్డారు. పారిశుద్ధ్య లోపంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు రోగాలబారిన పడుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు. దోమల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయం అన్నారు.
ఇది కూడా చదవండి.