నూతన ఆస్తిపన్ను చట్టాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ లెనిన్ కూడలిలో సీపీఐ, తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. రూపాయి సంక్షేమం పథకం రూపంలో అందిస్తూ... పది రూపాయల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని ఆరోపించారు. పన్ను పెంపు చట్టాలను ఎటువంటి చర్చ లేకుండా అసెంబ్లీలో ఆమోదించుకోవటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేస్తే ప్రజలపై అధిక భారం పడుతుందని వాపోయారు. తక్షణమే జీవో నంబర్ 197, 198 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ...ఏపీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగుల యత్నం