బిడ్డ వచ్చిన వేళ ..గొడ్డు వచ్చిన వేళ అని మన పెద్దలు అనే నానుడిని నిజం చేశాడు ఓ రైతు. ఇంటి అడబిడ్డలకు చేసినట్లుగానే ...ఎంతో మమకారంగా పెంచుకునే... గిరి జాతి ఆవులకి సీమంతం చేశాడు. గన్నవరం నియోజకవర్గం వీరవల్లి రైతు లంకా బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ. ఎంతో కాలంగా పెంచుకుంటోన్న గిరి జాతి ఆవు సంతతిలో తన గృహంలో జన్మించిన తల్లి, బిడ్డ రెండు ఆవులకి ఒకేసారి సీమంతం నిర్వహించారు.
స్థానిక మహిళలు, బంధువులు, ఇరుగు పొరుగు రైతులు పెద్ద ఎత్తున రైతు ఇంటికి వచ్చి.. ఆవుల సీమంతం జరిపించారు. పసుపు, కుంకుమతో అలంకరించి క్రతువు పూర్తిచేశారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని తినిపించి పండంటి దూడ పుట్టాలని ఆశీర్వదించారు. తమ ఇంట పుట్టిన ఈ గిరి అవుల.. ప్రతి కాన్పులకు ముందు ఇలాగే సీమంతం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతోందీ రైతు కుటుంబం.
ఇదీ చూడండి: