ETV Bharat / state

Vaccine: నేటి నుంచి తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు - తెలంగాణ కొవిడ్ టీకాలు

తెలంగాణలో నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 30 ఏళ్లు పైబడిన వారికి టీకా అందించిన సర్కారు జులై 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా అందించనుంది.

Telangana covid vaccination
తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు
author img

By

Published : Jul 1, 2021, 7:52 AM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాలు (Covid Vaccine) అందించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 30 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే టీకా అందిస్తున్న సర్కారు ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ అందించనుంది.

ఇందుకోసం జీహెచ్​ఎంసీ (Ghmc) పరిధిలో 100 టీకా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో కలిపి మరో 204, గ్రామీణ ప్రాంతాల వారి కోసం 636 పీహెచ్​సీ(PHC)లో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల వారు కొవిన్ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్నా.. లేక నేరుగా ప్రభుత్వ టీకా కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్​ పొందవచ్చని ప్రకటించిన వైద్యారోగ్య శాఖ.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం తప్పక కొవిన్ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. కోవిషీల్డ్ తీసుకున్న లబ్ధిదారులకు 14 వారాల నుంచి 16 వారాల మధ్య మాత్రమే 2వ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ప్రణాళికాబద్ధంగా...

కరోనా కట్టడికి ప్రధాన అస్త్రమైన వ్యాక్సిన్‌ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేపడుతోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు, సూపర్‌ స్ప్రెడర్లకు దశల వారీగా టీకా అందజేసింది. టీకా పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం కోటి డోస్‌లు మార్క్‌ని కూడా దాటింది. ఈ ఏడాది జనవరి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీకాల పంపిణీ ప్రారంభం కాగా... మొదటి 2 నెలలు కేవలం ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్‌లకు మాత్రమే వ్యాక్సిన్‌ అందించారు. ఆరంభంలో టీకా వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోయినా... మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్‌పై పెరిగిన అవగాహనతో జనం నుంచి విశేష స్పందన లభించింది.

ఇదీ చూడండి:

CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.