ETV Bharat / state

మచిలీపట్నంలో మహిళా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్​

author img

By

Published : May 22, 2021, 6:54 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మహిళా పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్​ ప్రక్రియను ప్రారంభించారు. టీకాపై అపోహలు వీడి, ధైర్యంగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు కోరారు.

covid vaccine
వ్యాక్సినేషన్​

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళా పోలీసు సిబ్బంది, పాలిచ్చే తల్లులకు కొవిడ్​ వ్యాక్సిన్​ మొదటి డోసు అందించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, అడిషనల్ ఎస్పీ మల్లిక, ఏఆర్​ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. పట్టణంలోని పోలీసు ఆస్పత్రిలో 32 మందికి టీకా వేశారు. వ్యాక్సినేషన్​పై ఎలాంటి అపోహలు వద్దని, సైడ్ఎఫెక్ట్స్ ఉండవని, ధైర్యంగా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని ఎస్పీ కోరారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని అడిషనల్ ఎస్పీ మల్లిక తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మహిళా పోలీసు సిబ్బంది, సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎం, ఏసీబీ సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి: స్వీయ నియంత్రణతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట: సీపీ బత్తిన శ్రీనివాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.