ETV Bharat / state

తిరుపతమ్మ ఆలయానికి కరోనా దెబ్బ...3 నెలల్లో రూ.7 కోట్ల ఆదాయానికి గండి - పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కొవిడ్ తీవ్ర ప్రభావం

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. మూడు నెలల్లోనే రూ.7 కోట్ల ఆదాయానికి గండి పడింది.

covid-effect-on-the-revenue-of-the-penuganchiprolu-sri-tirupatamma-temple
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయం
author img

By

Published : Oct 2, 2020, 12:01 PM IST

రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా.. జిల్లాలో విజయవాడ దుర్గగుడి తర్వాత స్థానంలో వెలుగొందుతున్న కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయ ఆదాయంపై కరోనా ప్రభావం పడింది. కేవలం మూడు నెలల వ్యవధిలో రూ. 7 కోట్ల ఆదాయానికి గండి పడింది. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించే పలు రకాల వ్యాపారాలు నిలిచిపోవడంతో వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా నిలిచిపోయింది.

covid-effect-on-the-revenue-of-the-penuganchiprolu-sri-tirupatamma-temple
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ ఆలయం
కరోనా వైరస్ కారణంగా....మార్చి 21న తిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. మళ్లీ ఆగస్టు 15న తెరిచారు. మధ్యలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జులై 9న తెరిచారు. కానీ పెనుగంచిప్రోలులో కరోనా కేసుల సంఖ్య పెరగటంతో అదే నెలలో 27న ఆలయాన్ని మూసేశారు. సహజంగా అమ్మవారి ఆలయంలో ఏడాది మొత్తంలో మార్చి నుంచి జూన్ వరకు భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలో రూ. 6.80 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా సమయంలో అర్చకులు ఏకాంతంగా అమ్మవారికి నిత్య పూజలు చేశారు. ఆ సమయంలో దర్శనాలు, ప్రత్యేక పూజలు ఆన్​లైన్ ద్వారా భక్తులకు అందించి ఏప్రిల్, మే, జూన్ నెలలో రూ. 1.34 కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. అయినప్పటికీ ఆలయం వద్ద లక్షలు వెచ్చించి పలు రకాల వ్యాపారాలు కోసమని దుకాణాలు దక్కించుకున్న వారు ఏప్రిల్ నుంచి వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో వారంతా ఆగిపోయిన కాలానికి అదనపు సమయం కావాలని ఇప్పటికే దేవస్థానం ఈవోకు విన్నవించారు. ఇంకా దీనిపై రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని ఈవో ఎన్.వి.ఎస్.ఎన్ మూర్తి తెలిపారు. వేతనాల్లో కోతలు

ఆలయంలో వివిధ హోదాలో పనిచేసే అధికారులు, సిబ్బంది మొత్తం 104 మంది ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆలయాన్ని మూసి ఉంచిన ఐదు నెలల సమయంలో అధికారులు, సిబ్బందికి వేతనాల్లో కోత విధించారు. ఆలయంలో రెగ్యులర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న 59 మందికి 50 శాతం, చివర గ్రేడు, అవుట్​ సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న 45 మందికి 10 శాతం జీతాల్లో కోతలు విధించారు. అయితే ఆగస్టు నెల నుంచి పూర్తిస్థాయి వేతనాలను ఇస్తున్నారు. గత ఐదు నెలల బకాయిలలో మూడు నెలల ఏరియర్స్ ఇప్పటికే చెల్లించారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్​ : పనిలేక పస్తులుంటున్న శిల్పకళాకారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.