అవనిగడ్డ ప్రాంతీయ ఆసుపత్రిలో 50 పడకల కొవిడ్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతీయాజ్, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తోందని... అదే విధంగా జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని.. ఒక్క అవనిగడ్డ నియోజకవర్గంలో ఆదివారం 61 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చొరవతో అవనిగడ్డలో సెంటర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఈ కేంద్రానికి కావాల్సిన వైద్య సిబ్బంది, మెడికల్ కిట్లు రానున్నాయని... మంగళవారం నుంచి కరోనా వైద్య సేవలు పూర్తిస్థాయిలో అవనిగడ్డ ఆస్పత్రిలో అందుబాటులోకి వస్తాయని వివరించారు. అవనిగడ్డ కొవిడ్ సెంటర్ కు ప్రత్యేక వైద్య సిబ్బందిని, మెడికల్ కిట్ లను వెంటనే పంపాలని కలెక్టర్.. డీఎంవోను ఆదేశించారు. వైద్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: