BharatBiotech: ఒమిక్రాన్‌పై కొవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తోందని భారత్ బయోటెక్ వెల్లడించింది. బూస్టర్ డోసుతో యాంటీ బాడీలు ఉత్పత్తవుతున్నాయని పేర్కొంది. డెల్టా, ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేలా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపింది. ఒమిక్రాన్‌పై జరిపిన పరిశోధనల్లో నిర్ధరణ అయినట్లు వివరించింది.
అమెరికాకు చెందిన ఎమోరి కేంద్రంలో పరిశోధనలు చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది. బూస్టర్ డోస్ తీసుకున్నవారి సెరాను ఒమిక్రాన్ లైవ్ వైరస్‌తో కలిపి పరిశోధనలు చేసినట్లు పేర్కొంది. డెల్టా సోకినవారిలో 100 శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పింది. ఒమిక్రాన్ సోకినవారిలో 90 శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని భారత్ బయోటెక్ ప్రకటించింది.
ఇదీ చదవండి
'మీరు రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు.. సినీ పరిశ్రమపై ఏపీ నేతల వ్యాఖ్యలకు తమ్మారెడ్డి కౌంటర్