తిరుపతిలో గరుడ వారధి నిర్మాణానికి.... తితిదే నుంచి నిధులు పొందాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తితిదేకు లేని అభ్యంతరం మీకెందుకుని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డిని హైకోర్టు ప్రశ్నించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా... తిరుపతి మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం వరకు గరుడ వారధి నిర్మాణానికి... తితిదే నుంచి 67 శాతం నిధులను పొందేందుకు... పురపాలకశాఖ ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ.... భానుప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం... ఈ వ్యవహారంతో మీకేమి సంబంధం ? మీకొచ్చిన నష్టమేమిటని వ్యాఖ్యానించింది. వ్యాజ్యంలో ప్రజాహితమే లేదని పేర్కొంది. నిధులను తితిదే దుర్వినియోగం చేస్తోందని భావిస్తే సంబంధిత అధికారులను ఆశ్రయించి వినతి సమర్పించుకోవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. పిల్‌ను ఉపసంహరించుకొని... తగిన ఫోరాన్ని ఆశ్రయించడానికి వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది.
ఇవీ చదవండి