కృష్ణాజిల్లా గుడివాడలో మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి ఎస్పీ రవీంద్ర బాబు వినూత్నంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. మాస్కు లేని వాహనదారులకు గులాబీ పువ్వులు, మాస్కులు అందజేసి.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా కేసుల నమోదు శాతం పెరుగుతున్నా.. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడం బాధాకరమన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో 94శాతం మంది పోలీసులు వ్యాక్సిన్ చేయించుకున్నారని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు