ETV Bharat / state

నందిగామ మార్కెట్​ యార్డులో తడిసిన పత్తి.. ఆందోళనలో రైతులు

నివర్​ తుపాను రైతులకు తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అకాల వానలకు పంట నష్టపోతున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

cotton farmers
పత్తి రైతులు
author img

By

Published : Nov 27, 2020, 3:53 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మార్కెట్​ యార్డుకు విక్రయించేందుకు పత్తి తీసుకొచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆరు బయట వేసిన పత్తి బస్తాలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి పోతుండటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. సీసీఐ అధికారులు గిట్టుబాటు ధర నిర్ణయించకపోవటంతో కొనుగోళ్లు జరగటం లేదు. ఐదు రోజులుగా అమ్మకందారులు వేచి చూస్తున్నారు. అధికారులు, పాలకులు కనీసం కన్నెత్తి చూడట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పత్తి బస్తాలు తడవకుండా వాటిపై పట్టాలు కప్పినప్పటికీ కింద నుంచి వర్షం నీరు చేరుతుందని రైతులు వాపోతున్నారు. పట్టాలపై నిలిచిన వాన నీటిని తొలగించేందుకు అవస్థలు పడుతున్నారు. దెబ్బతిన్న పత్తిని అసలు కొనుగోలు చేయరేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కృష్ణా రైతులకు కన్నీరు తెప్పిస్తున్న నివర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.