ETV Bharat / state

కరోనా వేళ ఏపీఎస్​ ఆర్టీసీ కీలక నిర్ణయాలు.. రోడ్డెక్కనున్న పలు సర్వీసులు - APS RTC take decisions on services at overal state

కరోనా కాలంలో ఏపీఎస్​ ఆర్టీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది. ఇకపై ఎసీ సహా అన్ని రకాల బస్సు సర్వీసులను కండక్టర్లతో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. క్రమంగా అన్ని రకాల బస్సు సర్వీసులను రోడ్డెక్కించేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్​ ఆర్టీసీ ఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీసీ ఈడీ ఆదేశాలు జారీ చేశారు.

APS RTC take decisions on services
కరోనా వేళ ఏపీఎస్​ ఆర్టీసీ కీలక నిర్ణయాలు
author img

By

Published : Jul 14, 2020, 11:16 PM IST

Updated : Jul 15, 2020, 3:21 AM IST

కండక్టర్లు లేకుండా బస్సులు నడిపే విధానాన్ని ఆర్టీసీ ఉపసంహరించుకుంది. ఇకపై పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కండక్టర్లతోనే నడపనుంది. కండక్టర్లను కొనసాగిస్తూనే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు పక్కన పెట్టిన ఏసీ బస్సులను సైతం రోడ్డెక్కనున్నాయి. కొవిడ్ సోకకుండా బస్సుల్లో నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.

కండక్టర్లు లేకుండా బస్సులు నడపాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టీసీ వెనక్కి తీసుకుంది. మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తీసుకొచ్చిన ఈ విధానాన్ని పక్కన పెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పల్లె వెలుగు ఎక్స్ ప్రెస్ బస్సులను కండక్టర్లతో తిప్పనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కండక్టర్లు లేకుండానే బస్సులను తిప్పాలని మే నెలలో నిర్ణయించారు. దీంతో కండక్టర్లు బస్టాప్‌లు, రిజర్వేషన్ కేంద్రాల వద్ద ఉంటూ టిక్కెట్లు జారీ చేస్తున్నారు. దీన్ని శాశ్వతంగా అమలు చేసేలా ఆర్టీసీ యోచించడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. పైగా మిగిలిన కండక్టర్లను కార్గో సర్వీసు సహా పొరుగు సేవల సిబ్బంది పనిచేసే స్థానాల్లో నియమించాలని ఆదేశాలు ఇచ్చారు. కండక్టర్ లేకుండానే పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా కీలక చర్యలు తీసుకోవడంతో కార్మిక సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఈ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కండక్టర్లను ఉపయోగించుకుంటూనే డిజిటల్ లావాదేవీలు పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇకపై ఆన్‌లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానం సహా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ టికెట్ల జారీ మరింత పెంచనున్నారు.

కండక్టర్లు, సిబ్బంది కరోనా బారీన పడకుండా బస్సుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందించాలని Rmలను ఆదేశించారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా 55 ఏళ్లపైన ఉన్న సిబ్బందిని వీలైనంత వరకు కార్యాలయాల్లోనే వినియోగించుకోనున్నారు. బస్సు సర్వీసులను సైతం పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు డిపోలకే పరిమితమైన ఏసీ బస్సులను సైతం ఇకపై రోడ్డెక్కించనున్నారు. కొన్ని నగరాలు సహా కంటైన్మెంట్ ప్రాంతాల్లో సిటీ సర్వీసులు తిప్పేందుకు మరికొంత కాలం ఆగనున్నారు. ఆర్టీసీ కార్గో సేవలను మరింత విస్తరించేలా చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయం పొందాలని నిర్ణయించారు. కండక్టర్లను కార్గో కౌంటర్లలో వినియోగించాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిబ్బంది సహా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇవీ చూడండి...

విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో నలుగురు అరెస్ట్

Last Updated : Jul 15, 2020, 3:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.