ETV Bharat / state

పెళ్లింట.. కరోనా తంటా!

author img

By

Published : Jul 25, 2020, 6:51 AM IST

పెళ్లింట కరోనా కష్టాలు మోసుకొస్తోంది. వధూవరుల్లో ఎవరో ఒకరు కొవిడ్‌ బారిన పడుతుండటంతో కొన్ని వివాహాలు వాయిదా పడుతుండగా... మరికొన్నింట్లో కల్యాణమైన కొద్ది గంటల్లోనే నవదంపతుల్లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలుతోంది. ఆయా వేడుకలకు హాజరైన వారంతా క్వారంటైన్‌కి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కొందరు పెళ్లిళ్లు వాయిదాలు వేసుకుంటుండగా ముందే ముహూర్తాలు పెట్టుకున్న వారు మాత్రం శుభకార్యాన్ని నిర్వహించేస్తున్నారు.

corona effect on marriages
వివాహాలపై కరోనా ప్రభావం

కరోనా ప్రభావం పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వధూవరులకు కరోనా సోకి..వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. మరికొన్నింట్లో కల్యాణమైన కొద్ది గంటల్లోనే నవదంపతుల్లో ఒకరికి కరోనా ఉన్నట్లు తేలుతోంది. ఆయా వేడుకలకు హాజరైన వారంతా క్వారంటైన్‌కి వెళ్లాల్సి వస్తోంది.

  • ఒక్క రోజు ముందు వాయిదా

తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం యువకుడికి బిళ్లకుర్రుకు చెందిన యువతితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. అబ్బాయి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఒంట్లో నలతగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. గురువారం ఉదయం అతణ్ని పెళ్లి కొడుకుని చేశారు. అదేరోజు సాయంత్రం అతనికి కరోనా ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి. ముహూర్తానికి ఒకరోజు ముందు పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. వరుడి బంధుమిత్రులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు.

  • అత్తారింటి దారిలో... ఆసుపత్రికి

కడప జిల్లా ఒంటిమిట్ట మండల వాసికి... నెల్లూరు జిల్లా గూడూరు యువతితో 3 రోజుల క్రితం వివాహమైంది. కల్యాణమైన తర్వాత ప్రత్యేక వాహనంలో నవ దంపతులిద్దరూ వధువు ఇంటికి బయల్దేరారు. వాహనం దారిలో ఉండగానే... వరుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అతన్ని వెనక్కి రప్పించారు.పెళ్లికి వెళ్లిన 46 మందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ముందుగానే సంబంధాలు కుదుర్చుకున్నప్పటికీ లాక్‌డౌన్‌తో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌, మేలలో జరగాల్సిన వివాహాలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం వివాహాలకు ఒక్కోచోట ఒక్కోలా అనుమతిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మరికొన్ని జిల్లాల్లో ఆర్డీవోలు, ఇంకొన్నిచోట్ల తహసీల్దార్లు అనుమతిస్తున్నారు. వధూవరుల ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తుండగా.. మరికొన్నిచోట్ల మాత్రం పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తె ఇద్దరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వధూవరుల తరఫున చెరో 20 మందిని అనుమతిస్తున్నారు. కల్యాణమండపాలకు సైతం 50 మంది వచ్చేలా పరిమితి విధించారు. వారందరి పేర్లు, చిరునామాలు, ఆధార్‌ వివరాలు, ఫోన్‌ నంబర్లనూ అర్జీపత్రంతో జత చేయాలి. అయితే పెళ్లిళ్లు చేసేవారు, హాజరయ్యేవారు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. చాలాచోట్ల బంధుమిత్రులను అధికంగా ఆహ్వానిస్తున్నారు. కుటుంబసభ్యులతోనే వేడుకను నిర్వహించుకోవడం శ్రేయస్కరం. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చూడాలి.

  • కొత్త జీవితంలోకి అడుగిడుతూనే..

కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తాడు. తన పెళ్లి కోసమని స్వగ్రామానికి వస్తూ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద స్వాబ్‌ నమూనా ఇచ్చాడు. ఇంటికి వెళ్లిపోయాడు. ముహూర్తం ప్రకారం వివాహమూ అయిపోయింది. ఆ మరుసటి రోజు వధువు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడే అబ్బాయి కొద్దిగా అస్వస్థతకు గురయ్యాడు. అంతలోనే అతనికి కొవిడ్‌ సోకినట్లు అధికారులు సమాచారమిచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. బంధువులందర్నీ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి.

దళితులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.