ETV Bharat / state

కరోనా ప్రభావం.. కళ తప్పిన బ్యూటీ పార్లర్లు! - లాక్​డౌన్​తో బ్యూటీషియన్లకు ఇబ్బందులు

రోజురోజుకూ ఆధునిక రీతులను సంతరించుకుంటున్న నేటి సమాజంలో సరికొత్తగా కనిపించడం సర్వసాధారణమైపోయింది. యువత మోజంతా ఫ్యాషన్ ప్రపంచంపైనే ఉన్నందున... అందానికి మెరుగులు దిద్దే బ్యూటీషియన్లకు డిమాండ్ ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్లుగా సాగే బ్యూటీపార్లర్లను కరోనా కోలుకోలేని దెబ్బకొట్టింది. బ్యూటీపార్లర్ల నడుపుతున్న మధ్యతరగతి మహిళల జీవనోపాధికి గండిపడింది.

బ్యూటీ పార్లరపై కరోనా ఎఫెక్ట్
బ్యూటీ పార్లరపై కరోనా ఎఫెక్ట్
author img

By

Published : May 24, 2020, 4:18 PM IST

బ్యూటీ పార్లరపై కరోనా ఎఫెక్ట్

అందానికి ఉన్న ఆకర్షణ, ఆదరణ నేటి ఆధునిక యుగంలో ఇంతా అంతా కాదు. అలాంటి అందానికి ఆధునిక మెరుగులు దిద్దేందుకు అవతరించినవే బ్యూటీపార్లర్‌లు. ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైనా..ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. ముఖ్యంగా యువతులు ఏ ప్రత్యేక సందర్భం వచ్చినా తమ అందానికి మెరుగులు దిద్దికుంటున్నారు. అందుకే ప్రతి వీధికీ మగవారి సెలూన్లకు పోటీగా బ్యూటీ పార్లర్లు వెలిశాయి.

అయితే గత 2నెలలుగా కరోనా ప్రభావం కారణంగా ఈ బ్యూటీపార్లర్లన్నీ మూతపడ్డాయి. నిర్వాహకులకు అద్దెల భారం అదనంగా మారింది. చాలా మంది గృహిణులు వారి ఇళ్లలోనే వీటిని నడుపుతూ ఎంతో కొంత సంపాదించుకునేవారు. కరోనా కారణంగా విధించిన లౌక్‌డౌన్‌ ఎవరికీ ఆదాయం లేకుండా చేసేసింది. సాధారణంగా వేసవి అంటేనే పెళ్లిళ్ల సీజన్. బ్యూటీషియన్లకు బాగా గిరాకీ ఉంటుంది.

లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లిళ్లు ఊసు లేకపోవడంతో బ్యూటీషియన్లకు పిలుపు కరవైంది. అడపాదడపా కొన్నిచోట్ల పెళ్లిళ్లు జరిగినా బ్యూటీషియన్లతో పనిలేకుండానే అవి జరిగిపోయాయి. వేసవి సెలవల్లో కొందరు బ్యూటిషీయన్‌ కోర్సులు నేర్పిస్తూ ఆదాయాన్ని ఆర్జించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నిర్వాహకులతో పాటు బ్యూటీ పార్లర్లు పనిచేసే వారు చాలామందికి ఉపాధి లేకుండా పోయింది.

ఇవీ చదవండి:

క్షౌరవృత్తిదారుల కడుపుకొట్టిన కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.