ETV Bharat / state

బంధువులకు భయం... స్థానికులు సానుభూతికే పరిమితం..

అయిన వాళ్లను దూరం చేస్తుంది.. చుట్టుపక్కల వాళ్లను కనీసం ఇంటివైపు చూడనివ్వట్లేదు.. కరోనా భయంతో మానవత్వం మంట కలిసిపోతోంది. నా అనే వాళ్లు ఎందరున్నా.. అంత్యక్రియలకు నోచుకోని దుస్థితి.. అనారోగ్యంతో మృతి చెందినా.. ఎవరూ అటువైపు చూడని పరిస్థితి.. అలాంటి ఘటనే కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జరిగింది.

బంధువులకు భయం.. స్థానికులు సానుభూతికే పరిమితం..

author img

By

Published : Aug 29, 2020, 7:38 PM IST

కరోనా కాలంలో మృతి చెందితే.. నా అన్నవాళ్లు దగ్గరకు రావడం లేదు.. చుట్టుపక్కల వాళ్లు ఇంటివైపు చూడటం లేదు.. సరిగ్గా నెల రోజుల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో జ్వరంతో ఓ వృద్ధుడు మృతి చెందితే.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు పంచాయతీ సిబ్బందే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు అదే గ్రామంలో మరో సంఘటన జరిగింది.

పెనుగంచిప్రోలు పంచాయతీ కార్యాలయం రోడ్డులో నోముల నాగేశ్వరరావు (38) అతని తల్లి నోముల వెంకటరత్నం (70) నివాసం ఉంటున్నారు. అవివాహితుడైన నాగేశ్వరరావు తాపీ పని చేస్తూ తల్లితో కలిసి ఉంటున్నాడు. పనులు ముగించుకొని గురువారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా శివపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శుక్రవారం ఆటోలో ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో హఠాత్తుగా మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన విషయాన్ని తల్లి బంధువులకు తెలియజేసింది. భయంతో ఎవరూ రాలేదు. స్థానికులు దూరం నుంచే చూసి వెళ్లిపోయారు.

ఆ తల్లి రోదిస్తూ కుమారుడి శవంతో రాత్రంతా గడిపింది. ఈ విషయం జనసేన నియోజకవర్గ బాధ్యుడు బాడిస మురళి కృష్ణకు శనివారం తెలిసింది. నలుగురు కార్యకర్తలతో వచ్చి స్థానికంగా ఉన్న శ్మశానంలో తల్లి చేత అంతిమ సంస్కారాలు జరిపించారు.

ఇదీ చదవండి: కరోనా వేళ.. వ్యర్థాల వినియోగంలో ఆదర్శం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.