ETV Bharat / state

ఆదుకునే వాళ్లు లేక.. ఏం చేయాలో తెలియక..! - కృష్ణా జిల్లాలో కరోనా కల్లోలం

‘కొన్ని కుటుంబాల్లో కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం మాటల్లో చెప్పలేనిది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వారిని కోల్పోయిన కొన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఒక్కో కుటుంబంలో ఇద్దరేసి చొప్పున మృత్యువాత పడ్డారు. ఓ కుటుంబంలో ఆధారంగా ఉన్న తండ్రి, కొడుకులు ఇద్దరూ మృతి చెందడంతో.. ప్రస్తుతం మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో.. ఏం చేయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మరో కుటుంబంలో వ్యాపారం చేసే తండ్రి, ఎంబీబీఎస్‌ పూర్తి చేసి పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు సీటు సాధించిన కుమారుడు చనిపోయారు. ఇంకో కుటుంబంలో ఇంటికి పెద్దగా ఉన్న తల్లి, కుమారుడు చనిపోయారు. మరో కుటుంబంలో ఇద్దరు మగవాళ్లు చనిపోవడంతో ఇద్దరు మహిళలు ఒంటరిగా మిగిలారు.

corona creating disturbance in families
కరోనా కల్లోలం
author img

By

Published : Sep 3, 2020, 10:19 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 278 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబంలో ఇద్దరేసి చొప్పున ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబాల్లో కొన్నింటి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కనీసం వారిని ఆదుకునే వాళ్లు కూడా లేక.. ఎలా బతకాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం కొన్ని కుటుంబాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. కొందరికి ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉన్నా ఇంటిని నడిపించే ప్రధాన ఆధారంగా ఉన్న మగవాళ్లు ఇద్దరేసి చనిపోవడంతో వారి బాధ వర్ణనాతీతంగా మారింది. అసలు.. తమ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఊహ సైతం లేకపోవడంతో ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనల నుంచి వారు కోలుకోలేకపోతున్నారు.

  • వైద్యుడైన కొడుకు, తండ్రి..

విజయవాడలోని భవానీపురానికి చెందిన మెడికల్‌ హోల్‌సేల్‌ వ్యాపారం చేసే దేవరశెట్టి చెంచయ్య కరోనా వైరస్‌ బారినపడి చనిపోయారు. రెండు రోజుల తర్వాత వైద్యుడైన ఆయన కుమారుడు లక్ష్మణ్‌ కూడా చనిపోయారు. ఇతను ఎంబీబీఎస్‌ పూర్తి చేసి.. పీజీ వైద్య విద్య కోసం కాకినాడ రంగరాయ కళాశాలలో సీటు కూడా సాధించారు. అర్ధంతరంగా వైరస్‌ బారినపడి చనిపోయారు. ఈ బాధ నుంచి ఇప్పటికీ వారి కుటుంబం కోలుకోలేకపోతోంది.

  • తల్లి, కొడుకు చనిపోవడంతో..

పెనమలూరు మండలం చోడవరానికి చెందిన పలివెల సూర్యనారాయణ కరోనా వైరస్‌ బారినపడి చనిపోయారు. పది రోజుల తర్వాత ఆయన తల్లి సత్యవతి కూడా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఈ కుటుంబం సైతం ఇద్దరు ఇంటి పెద్దలను కోల్పోయి విలవిలలాడుతోంది.

  • వరుసగా అన్నా, తమ్ముడు..

విజయవాడ వన్‌టౌన్‌కు చెందిన తాడేపల్లి వసంతరావు కరోనా వైరస్‌ బారినపడి చనిపోయారు. ఆయన విజయవాడ కొవిడ్‌ ఆసుపత్రిలో చనిపోయిన పది రోజుల తర్వాత భార్య ధనలక్ష్మికి ఆ విషయం తెలిసింది. అప్పటివరకు తన భర్త బతికే ఉన్నాడనుకుని.. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. చివరికి పోలీసు కేసు పెట్టడంతో.. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పది రోజుల తర్వాత గుర్తించారు. వసంతరావు అన్నయ్య ప్రసాదరావు సైతం అంతకుముందు వారం కిందటే చనిపోయారు. వసంతరావు, ప్రసాదరావు ఇద్దరికీ పిల్లలు లేరు. దీంతో ప్రస్తుతం వీరి భార్యలు ఇద్దరు ఒంటరిగా మిగిలారు.

ఇదీ చదవండి: కొవిడ్ దూకుడు తగ్గేదెన్నడు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.