రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
కొత్తగా 11 వేల 303 కేసులు..
కొత్తగా 11,303 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి బారి నుంచి మరో 18,257 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం లక్షా 46 వేల 737 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
93 వేల 704 మందికి పరీక్షలు..
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 93 వేల 704 మందికి కొవిడ్ నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. అత్యధికంగా తూ.గో జిల్లాలో 2,477 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. మహమ్మారితో అత్యధికంగా ప.గో జిల్లాలో 20 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా కరోనా మృతులు..
చిత్తూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 9 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక స్పష్టం చేసింది. కరోనాతో గుంటూరు జిల్లాలో 9, తూ.గో జిల్లాలో 8 మంది మృతి చెందారు. మరోవైపు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో 1,536, అనంతపురంలో 953 కొవిడ్ కేసులను గుర్తించినట్లు వెల్లడించింది. కోస్తా జిల్లాలైన ప.గోలో 1,116 కేసులు, విశాఖలో 985 కేసులను నమోదు చేసినట్లు పేర్కొంది.
ఇవీ చూడండి : కొవిడ్‌ను జయించి.. విధికి తలొంచి!