ETV Bharat / state

విజృంభిస్తున్న కరోనా.. జిల్లాలో తాజాగా 545 మందికి పాజిటివ్ - కృష్ణా జిల్లాలో కరోనా కేసులు

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ రోజు తాజాగా 545 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 19,959 మందికి కరోనా సోకింది. ఇందులో 16,578 మంది కోలుకున్నారు. 330 మంది మరణించారు.

corona cases
corona cases
author img

By

Published : Sep 10, 2020, 7:24 PM IST

కృష్ణా జిల్లాలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి అదుపులోకి వస్తుందనుకునే తరుణంలో ఒక్క రోజే 545 కొత్త కేసులు నమోదు కావడం కలవరపరుస్తోంది. ఈ కేసులన్నీ నూజివీడు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే ఉండడంతో జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌.. రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

గతంలో ఒక్క రోజులో అత్యధికంగా 470 కేసులు నమోదు కాగా.. గడచిన 24 గంటల్లో 545 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ముసునూరు, రెడ్డిగూడెం, గంపలగూడెం, ఉంగుటూరు మండలాల్లో ఒక్క రోజులోనే వంద కేసులు నమోదయ్యాయి. బుధవారం 5,516 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారిలో 545 మందికి కరోనా నిర్ధరణ అయింది. ముసునూరు మండలం రమణక్కపేటలో 40 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాని గంపలగూడెం మండలంలో ఒకేసారి 21 మంది కరోనా బారినపడ్డారు.

నూజివీడు డివిజనులోని ఈ నాలుగు మండలాల్లో ఇంత పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదు కావడంపై కారణాలు విశ్లేషించి.. తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్.. యంత్రాంగాన్ని ఆదేశించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 19,959 మందికి కరోనా సోకింది. ఇందులో 16,578 మంది వైద్యం అనంతరం ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకోగా.. 330 మంది మరణించారు. ప్రస్తుతం 3,051 మంది కొవిడ్‌ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రవైటు ఆసుపత్రుల్లో కరోనా వైద్యం పొందుతున్నారు.

ఇదీ చదవండి:

మరోసారి 10 వేలకు పైనే కేసులు... 5,37,687కి చేరిన బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.