ETV Bharat / city

'కరోనా గురించి భయం వద్దు...'

కరోనాను జయించడానికి వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు... కేవలం 3 వందల రూపాయలు చాలంటున్నారు రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి. విటమిన్‌ మందులతో పాటు జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఉంటే సంబంధిత మాత్రలు వేసుకుంటే సరిపోతుందని భరోసా ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం పేరిట దోపిడీకి గురికావద్దంటున్న డాక్టర్ ప్రభాకర్‌రెడ్డితో ముఖాముఖి.

doctor prabhakar
doctor prabhakar
author img

By

Published : Sep 11, 2020, 6:13 AM IST

Updated : Sep 14, 2020, 3:19 PM IST

డాక్టర్ ప్రభాకర్‌రెడ్డితో ముఖాముఖి

కరోనాను జయించటానికి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని... కేవలం 300 రూపాయలు ఉంటే చాలని అంటున్నారు రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా మెడికల్ దుకాణాల్లో లభ్యమయ్యే మందులతోనే కొవిడ్​ను జయించవచ్చని స్పష్టం చేశారు. సీటీ స్కాన్ల కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు పెట్టవద్దని చెప్పారు. కరోనా చికిత్సకు సంబంధించిన అంశాలను ఆయన 'ఈటీవీ భారత్'​తో పంచుకున్నారు.

ప్రశ్న: మీరు 300 రూపాయలతోనే కరోనా వైద్యం అని చెబుతున్నారు. 300 రూపాయలతో కరోనా వైద్యం అంటే ఏమిటి?
జవాబు : 300 రూపాయలతో కరోనా వైద్యం అనేది కొత్తగా చెప్పడం లేదు. మలేరియా వస్తే క్లోరోక్విన్ తీసుకోండి అని గోడలపై రాసేవారు. ఈ మందులు కూడా అలా
చెప్పడం లాటిందే. 300 రూపాయల వైద్యంలో ఎనిమిది రకాల మందులు ఉంటాయి. జ్వరం వస్తే పారాసిటమాల్, దగ్గు మందు, విటమిన్, మెగ్నీషియం మాత్రలు, కడుపు మంట కోసం పాంటాప్‌ మాత్రలు ఉన్నాయి. ఒక్క స్టెరాయిడ్ ఉంది. వీటిని వాడటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఇందులో ఉండే స్టెరాయిడ్స్ తక్కువ డోసులో తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. కొవిడ్ కేర్ సెంటర్‌కు వెళ్లినా ఇవే మందులు ఇస్తారు.

  • ఈ మాత్రలు ఎలాంటి వారు? ఎప్పుడు వేసుకోవాలి?

చిన్న పిల్లలు మినహా అందరూ వేసుకోవచ్చు. ఏమీ భయపడవద్దు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే ఈ మందులు వాడండి. స్వాబ్‌ టెస్టు చేయించండి. ఫలితం ఆలస్యమైనా భయపడవద్దు. మీకు వైద్యం జరగుతూ ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రులకు పెరిగెత్తవద్దు. 93 శాతం కంటే ఆక్సిజన్ శ్యాచురేషన్ తగ్గితే ప్రభుత్వాసుపత్రిలో చేరండి. పడకలు చాలా ఖాళీగా ఉన్నాయి. 300 రూపాయల మందులు వాడితే 90 శాతం మందికి ఆసుపత్రికి వెళ్లే అవసరమే లేదు.

  • ఎలాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందులు వాడాలి?

దీనికి 14 రకాల లక్షణాలు ఉన్నాయి. దగ్గు, జలుబు, తమ్ములు, ఆయాసం, కడపు నొప్పి, వాంతులు, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవడం. 14 రకాల లక్షణాల్లో ఐదు లక్షణాలు ఉంటే మైల్డ్ అని, ఐదు నుంచి పది లక్షణాలు ఉంటే అనుమానం, పది నుంచి 14 లక్షణాలు ఉంటే కచ్చితంగా నిర్ధరణ. కరోనా నిర్ధరణ చేసుకోవాలంటే స్వాబ్ టెస్టు కచ్చితంగా చేయించుకోవాలి. కరోనా బాధితుల్లో ఒక్క శాతం మంది మాత్రమే చనిపోతున్నారు. కరోనా అంటే అవగాహన లేక ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు... చనిపోతున్నారు. కరోనా మీద అవగాహన ఉంటే ఇది చిన్న జబ్బే.

  • సీటీ స్కాన్ కరోనాను నిర్ధారిస్తుందా?

సీటీ స్కాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయించుకోవద్దు. సీటీ స్కాన్‌లో చిన్న లక్షణాలు కనిపిస్తాయి. అది కరోనాను చెప్పలేదు. మళ్లీ స్వాబ్ టెస్టు చేయాల్సిందే. అటు ఇటు తిరగకుండా స్వాబ్ టెస్టు చేయించుకోండి.

  • ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది ?

కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. మిగతా జిల్లాల్లోనూ త్వరలో వైరస్ ప్రభావం తగ్గుతుంది. కరోనా తగ్గే సమయంలో దీని కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు. డబ్బులున్న వారు ఈ మందులను ఒక కిట్‌గా చేసి పేదలకు పంచండి. కరోనా వస్తే వివక్షతకు గురవుతామని కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ 300 రూపాయల మందులతో కరోనా భయం, కరోనా రెండూ ఖతం అయిపోతాయి.

Last Updated : Sep 14, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.