కృష్ణాజిల్లా బాపులపాడు పంచాయతీ సర్పంచి అభ్యర్థులు ప్రియాంకా గాంధీ, కమలాభాయ్ నామినేషన్ల పరిశీలనలో స్వల్ప వివాదం చెలరేగింది. ఇందులో ఒకరు తెదేపా, మరొకరు వైకాపా మద్దతుదారులు. ఒకరిపై మరొకరు అభ్యంతరాలు తెలుపుకోవడంతో ఇరువర్గాల మధ్య మాటా.. మాటా పెరిగింది. ఎన్నికల నిర్వహణ స్టేజ్-1 అధికారి కలగజేసుకుని నిబంధనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పడంతో వివాదం సర్దు మణిగింది.
ఇదీ చదవండి: కృష్ణాజిల్లాలో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్