ETV Bharat / state

మచిలీపట్నంలో క్రీడా మైదాన నిర్మాణం పూర్తయ్యేనా? - AP Latest News

Machilipatnam Indoor Stadium: క్రీడాకారుల కేరింతలతో సందడిగా ఉండాల్సిన ప్రాంతం.. నేడు పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలతో దర్శనమిస్తోన్న వైనం. టీడీపీ హయాంలో మచిలీపట్నంలో 2018లో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేసింది. స్టేడియం నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం.. పాలకుల నిర్లక్ష్యన్ని చూసి నవ్వుకుంటుంది. స్టేడియం నిర్మాణం కోసం సేకరించిన స్థలాన్ని ఇతర ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు కేటాయించారు. వైసీపీ నేతలు స్టేడియం నిర్మాణాన్ని అడ్డుకోవడంపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Machilipatnam Indoor Stadium
Machilipatnam Indoor Stadium
author img

By

Published : Mar 27, 2023, 11:22 AM IST

మచిలీపట్నంలో కలగానే క్రీడా మైదానం.. పిచ్చి మెక్కలు, ముళ్ల కంపలతో తలపిస్తున్న వైనం

Machilipatnam Indoor Stadium: ముందుచూపులేని పాలకులు.. అధికారుల తీరుతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో క్రీడా స్టేడియం నిర్మాణం కలగానే మారిపోయింది. ఖేలో ఇండియా ద్వారా మచిలీపట్నంలో స్టేడియం నిర్మాణానికి చేయుత అందిస్తామని కేంద్రం చెబుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలోని గోసంఘం వద్ద 25 ఎకరాలను 2018లో అప్పటి టీడీపీ పాలకులు సేకరించారు. ఇందులో మచిలీపట్నం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్మాణానికి 11.10 ఎకరాలు కేటాయించారు. అలాగే డిడ్కో ఇళ్లకు సమీపంలోనే 13.27 ఎకరాలను జిల్లా క్రీడాప్రాధికార సంస్థకు ఇండోర్‌ స్టేడియం నిర్మాణం నిమిత్తం కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా స్డేడియం నిర్మాణానికి 2018లో శంకుస్థాపన చేయించారు.

వైసీపీ వచ్చాక ఆగిన నిర్మాణ పనులు.. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో స్టేడియం నిర్మాణ పనులను నిలిపివేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు మనసు మారి స్టేడియం నిర్మాణం చేస్తారని క్రీడాకారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం స్డేడియం నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమి పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలు పెరిగి అడవిని తలపిస్తోంది. క్రీడాకారులు కేరింతలో సందడిగా ఉండాల్సిన ప్రదేశం నేడు పశువులకు నిలయంగా మారింది. ఇక్కడ నిర్మాణం జరగకుండా వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం నిర్మాణ పనులు నిలిచిపోవడంతో క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టేడియం కోసం కేటాయించిన భూమిని వేరే వాటి కోసం కేటాయింపు.. రెండుసార్లు శంఖుస్థాపనలు చేసినా స్టేడియం నిర్మాణం మాత్రం జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాణం చేయాలని ప్రతిపాదిస్తున్న ప్రాంతాని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం నిర్మాణం జరగాల్సిన 13 ఎకరాల స్థలంలో 5 ఎకరాలు స్కిల్ డవలప్ మెంట్, 1 ఎకరం మెడికల్ హబ్, 5 ఎకరాలు పాలిటెక్నిక్ కళాశాలకు కేటాయించారని క్రీడాకారులు తెలిపారు. స్థానిక శాసన సభ్యులకు ఇక్కడ స్టేడియం నిర్మాణం జరగడం ఇష్టం లేదని అందుకే స్టేడియం నిర్మాణం కోసం కేటాయించి భూమిని ఇతర వాటి కోసం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. స్డేడియం భూమి ఇంకా ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ పేరునే ఉందన్నారు.

ఆవేదనలో యువత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సన్నద్దం కావాలంటే మచిలీపట్నంలో స్టేడియం లేకపోవడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక నడిచేందుకు సరైన వాకింగ్ ట్రాక్ కూడా లేదని పట్టణ వాసులు చెబుతున్నారు. నిరుద్యో యువత సాధన చేసేందుకు గతంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్​కు అధికారులు అనుమతి ఇచ్చే వారని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.. మచిలీపట్నం అభివృద్దికి కృషి చేస్తామన్న స్థానిక శాసన సభ్యులు స్టేడియం నిర్మాణానికి ఎందుకు అడ్డుపడుతున్నారో ఆర్ధం కావడ లేదని విపక్షాల నేతలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేసి మచిలీపట్నం వాసులకు అందిస్తామని వారు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.