ఆపదలో ఉన్న మహిళకు మరో మహిళా కానిస్టేబుల్ రక్తదానం చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అవనిగడ్డకు చెందిన వెంకట లక్ష్మీకి రక్తం అవసరమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించారు. దిశ పోలీస్ స్టేషన్లో మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వాతి అది చూసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి రక్తం దానం చేసింది. స్వాతి సేవా గుణాన్ని చూసి పలువురు పోలీసు అధికారులు ఆమెను అభినందించారు. సమయానికి తమ కుమార్తెకు రక్తదానం చేసిన కానిస్టేబుల్ స్వాతికి మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: 'అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేద్దాం'