వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా డిసెంబర్ 21న అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెన్ ఆందోళనలు చేపడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు.. రైతు సంఘాలు ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతు సంఘాల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతిస్తోందని అన్నారు.
రోజుల తరబడి రైతులు నిరసన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ రైతు బిల్లులను వ్యతిరేకిస్తున్నటు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బిల్లులకు లోక్సభ, రాజ్యసభలో ఓటేసినందుకు క్షమాపణ చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం