ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించడంపై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని.. గాయపడి ఆసుపత్రిలో ఉన్న వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులపై వేటు సరికాదన్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరోలా ఉందని విమర్శించారు. ఉద్యోగులను తొలగించవద్దని పరిశ్రమలకు సలహాలు ఇచ్చిన ప్రభుత్వం.. ఆర్టీసీలో 6 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎలా తొలగించిందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కాంట్రాక్ట్ తొలగింపు ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: