ఇదీ చదవండి :
'రహస్య అజెండాతో పని చేస్తే.. ప్రజలు బుద్ధి చెబుతారు' - అమరావతి లెటెస్ట్ న్యూస్
రహస్య అజెండాతో పాలన చేయాలనుకుంటే... ప్రజలు బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. ప్రజలందరీ అభీష్టం మేరకు ప్రభుత్వాలు నడుచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ నేత శైలజానాథ్ మీడియా సమావేశం
రహస్య అజెండాతో పాలన చేస్తున్న ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరీ అభీష్టం మేరకు రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కర్నూలుకు హైకోర్టు వస్తే మంచిదేనన్న ఆయన... దానితో ఆ ప్రాంతం అంతగా లాభపడేదేమీ లేదన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని సమర్థించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాజధానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. రేపు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామని విజయవాడలో శైలజానాథ్ తెలిపారు.
ఇదీ చదవండి :
sample description