ETV Bharat / state

పాస్‌ చేస్తారా.. పరీక్ష పెడతారా..? - News on distance education exams

దూరవిద్యలో పది, ఇంటర్‌ చదువుతున్న వారిలో ఉత్కంఠ నెలకొంది. వారికి పరీక్షలు నిర్వహిస్తారా..? లేదా రద్దు చేస్తారా అనే సందిగ్ధంలో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

confusion in distance exams in andhra pradesh
దూరవిద్య పరీక్షలపై సందిగ్ధం
author img

By

Published : Jun 28, 2020, 1:58 PM IST

కరోనాతో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరిని రాష్ట్ర ప్రభుత్వం పాస్‌ చేసింది. ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ అదే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరినీ పాస్‌ చేసింది. అయితే దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారి విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరిధిలోని కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి 71,210 మంది, ఇంటర్మీడియట్‌ 97,507 మంది చదువుతున్నారు. వచ్చేనెల 18 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించేలా ఇటీవలే షెడ్యూలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,68,717 మందిని పాస్‌ చేస్తారా.. పరీక్ష రాయిస్తారా అనే ఉత్కంఠ ఉంది.

దూరవిద్య కేంద్రాల జిల్లా సమన్వయకర్తలకు విద్యార్థులు ఫోన్‌చేసి పది, ఇంటర్‌లో అందరిని పాస్‌ చేశారు కదా మేమూ పాస్‌ అయినట్లేనా అని ఆరా తీస్తున్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లా వారికి ఎఫ్‌-1, ఎఫ్‌-2 పరీక్షలు లేవు.. దీంతో ఒకవేళ అందరిని పాస్‌చేస్తే మార్కులు ఎలా కేటాయిస్తారనే మీమాంస ఉంది. పరీక్షలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: పర్చూరులో పాముల సయ్యాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.