జిల్లాలో ఓ వైపు పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నా.. మరో వైపు అక్కడక్కడా చెదురుమదురు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మైలవరం మండలం మొర్సుమల్లిలో రెండు పార్టీల మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాలు గొడవకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇవీ చూడండి...: పంచాయతీ ఎన్నికల్లో జగన్కు చెక్ పెట్టాలి: చంద్రబాబు