చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని రాఘవాచారి విశ్వసించారని సీఎం జగన్ కొనియాడారు. యువతరాలకు చక్రవర్తుల రాఘవాచారి ప్రేరణగా నిలిచారని ఆయన అన్నారు. జర్నలిస్టుగా ఆయన రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తాయన్నారు.
చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి ఉన్నారని చంద్రబాబు అన్నారు.
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన సేవలు ఎనలేనివి సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారని తెలిపారు.
మూడు దశాబ్దాల పాటు విశాలాంధ్ర పత్రిక ప్రధాన సంపాదకులుగా సేవలు అందించిన చక్రవర్తుల రాఘవాచారి గారి మరణం బాధాకరమని కన్నా లక్ష్మీనారాయణ విచారం వ్యక్తం చేశారు.
రాఘవాచారి మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి