ETV Bharat / state

స్నేహితుల మధ్య వివాదం.. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నం! - నేర వార్తలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు ఇచ్చిన వాగ్మాలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

committed suicide attempt
committed suicide attempt
author img

By

Published : Sep 12, 2021, 10:25 PM IST

కృష్ణా జిల్లా అవనిగడ్డలో స్నేహితుల మధ్య ఏర్పడిన వివాదంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పెట్రోల్​ పోసుకుని.. నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అవనిగడ్డ 3వ వార్డుకు చెందిన మెండు సూర్యకుమార్ కొద్దిరోజుల పాటు కొరియర్ బాయ్​గా పని చేయగా.. ఆటో కిస్తీకి సంబంధించి తన మిత్రులతో వివాదం ఏర్పడింది. మాటా మాటా పెరిగి గత నెలలో ఘర్షణ జరగగా ఇరువురి పెద్దలు రాజీకుదిర్చారు. తరువాత కూడా మిత్రులు ఎగతాళి చేస్తూ ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురై.. సదరు యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య కుమార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అవనిగడ్డ న్యాయమూర్తి జీవీఎల్ సరస్వతి.. ఆసుపత్రికి వచ్చి సూర్యకుమార్ దగ్గర వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని పోలీసులు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్ తెలిపారు. ఘటనపై సూర్యకుమార్ బంధువుల నుంచి ఫిర్యాదు నమోదు చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:

ASSAULT : వినాయక నిమజ్జన వేడుకలో ఘర్షణ... తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.