కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్... గన్నవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న గ్రామ వాలంటీర్ల ఎంపిక కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో 25 పంచాయతీలకు గాను 450 వలంటీర్ల ఉద్యోగాలు ఉన్నాయని... వాటి కోసం ఇప్పటికే 1181 దరఖాస్తులు రాగా పరిశీలించి అర్హులైన వారిని గ్రామ వాలంటీర్లుగా నియమించనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు గడపగడపకు చేరేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి చురుకైన యువతి యువకులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి :