ETV Bharat / state

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

పంచాయతీ ఎన్నికల్లో మొదటి అంకంక ఈరోజు మొదలు కాగా.. కృష్ణా జిల్లాలోని పలు నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ ఇంతియాజ్, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. ఎన్నికల అధికారులకు వివిధ అంశాలపై సూచనలిచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

collector, sp visits nomination centers in krishna district
నామినేషన్ కేంద్రాలు పరిశీలించిన కృష్ణా కలెక్టర్, ఎస్పీ
author img

By

Published : Jan 29, 2021, 5:45 PM IST

కృష్ణా జిల్లాలో తొలివిడతగా.. 234 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను ఆయన సందర్శించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వు పంచాయతీల్లో అభ్యర్థులకు అవసరమైన కుల ధ్రువీకరణ పత్రాల జారీలో.. జాప్యం చేయవద్దని అన్ని మండలాల తహసీల్దార్​లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

కంచికచెర్ల మండలంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా.. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

పల్లె పోరుకు తెరలేచింది.. ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.