ETV Bharat / state

బెజవాడలో జియోగ్రాఫికల్​ క్వారంటెయిన్​

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వైరస్​ వ్యాప్తి నిరోధకానికి మరిన్ని కఠిన చర్యలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా విజయవాడలోని కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో ఇంతియాజ్​.. నగరపాలక సంస్థ కమిషనర్​, సంయుక్త కలెక్టర్​, కంటెయిన్​మెంట్ ప్రాంతాల ఇన్​ఛార్జ్​​ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో జియోగ్రాఫికల్​ క్వారంటైన్​ అమలు చేయాలని ఆదేశించారు.

Meeting of Collector Intiaz
కలెక్టర్ ఇంతియాజ్​​ సమావేశం
author img

By

Published : Jul 24, 2020, 8:02 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు ఐదు వేలకు సమీపిస్తుండటం.. అందులోనూ విజయవాడలోనే అత్యధిక కేసులు నమోదవుతోన్న తరుణంలో అధికారులు వైరస్​ వ్యాప్తి నిరోధానికి 11 ప్రాంతాలను గుర్తించారు. వైరస్​ కట్టడి చేసేందుకు ఆయా ప్రాంతాలను కంటెయిన్​మెంట్​ జోన్లుగా ప్రకటించారు. విజయవాడలోని కలెక్టరు క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ అహ్మద్‌.. నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, సంయుక్త కలెక్టరు మాధవీలత, కంటెయిన్​మెంట్​ జోన్‌ల ఇన్‌ఛార్జి అధికారి వెంకటరావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను కట్టడి చేసి.. అక్కడి ప్రజలకు పరీక్షలు చేస్తే వ్యాప్తిని తగ్గించొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. వారం రోజులపాటు పగడ్భందీగా బారికేడింగ్‌ చేసి ప్రజలందరూ ఒకే దారి నుంచి వచ్చి, తిరిగి అదే దారి వెంట వెళ్లేలా జియోగ్రాఫికల్‌ క్వారంటైన్‌కు ఆదేశించారు.

నగరంలోని పటమట, కృష్ణలంక, కొత్తపేట, మొగల్రాజపురం, విద్యాధరపురం, అజిత్‌సిగ్‌నగర్‌, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, వించిపేట, చిట్టినగర్‌ ప్రాంతాలను కంటెయిన్​మెంట్​ జోన్లుగా నిర్ణయించారు. రేపటి నుంచి ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు అమలవుతాయని కలెక్టరు ఇంతియాజ్‌ పేర్కొన్నారు.

సంచార రైతు బజార్లు అనుమతించడం ద్వారా.. రైతు బజార్ల వద్ద రద్దీ తగ్గిస్తామని సంయుక్త కలెక్టరు మాధవీలత తెలిపారు. కంటెయిన్​మెంట్​ జోన్లలో పోలీసులు బ్లూకోట్‌ వేసుకొని కొవిడ్‌ జాగ్రత్తలపై మైకుల్లో ప్రజలను హెచ్చరించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ కోరారు.

ఇవీ చూడండి...

'వ్యాధి సోకిన వారు 10 రోజులు కరోనా దీక్ష చేస్తే వైరస్ జయించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.