ETV Bharat / state

డిశ్చార్జ్ అయిన వారికి నగదు ప్రోత్సాహకం

కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు 14, 91, 680 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసుల శాతం సగటున 5.03 గా ఉందన్నారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స పొంది, కోలుకుని డిశ్ఛార్జ్‌ అయిన వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని చెప్పారు.

collector
కలెక్టరు ఇంతియాజ్‌
author img

By

Published : May 16, 2021, 12:12 PM IST

కృష్ణా జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. ఆయా వ్యక్తులకు ఉన్న కొవిడ్‌ లక్షణాలను బట్టి.. వైద్య నివేదికల ఆధారంగా చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. విజయవాడలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు పాల్గొని జిల్లాలోని పరిస్థితులను వివరించారు. మొత్తం ఏడు కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నామని.. ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో చికిత్స పొంది, కోలుకుని డిశ్ఛార్జ్‌ అయిన వారిని గుర్తించి, నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామన్నారు. ముగ్గురిని లక్కీ డీప్‌ ద్వారా ఎంపిక చేసి, ప్రతి సోమవారం ప్రకటిస్తామని చెప్పారు. విజేతలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు పురస్కారాలు అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో ఏడు కొవిడ్‌ కోర్‌ కేంద్రాలు ఉండగా, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తేనున్నట్టు కలెక్టరు తెలిపారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అశోక్‌కుమార్‌ సింఘాల్‌ కొవిడ్‌ పరిస్థితులపై జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. నిన్న ఒక రోజున 22,575 మందికి కొవిడ్‌ టీకా వేసినట్టు తెలిపారు. 5,463 నమూనాల నివేదికలు రాగా, వీటిలో 412 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

కొవిడ్ నోడల్ అధికారికే దక్కని పడక.. సమయానికి చికిత్స అందక కన్నుమూత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.