కరోనాపై పోరాటంలో భాగంగా.. యాంటీ బాడీ కాక్‌టెయిల్ మందు ఇప్పుడు రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా పాజిటివ్ వచ్చినపుడు ఈ మందు తీసుకున్నారు. అదే ఏడాది నవంబర్‌లో అమెరికా ఈ కాక్‌టెయిల్ యాంటీ బాడీ మందుకు.. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
వేగంగా ఇస్తే ఉపయోగం ఎక్కువ..
కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిన బాధితులు.. తొలి 5 నుంచి 10 రోజుల్లోపు ఈ మందు వాడితే సత్ఫలితాలిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్సా విధానం ద్వారా ఆసుపత్రిలో చేరికను 70 శాతం తగ్గించొచ్చనేది వైద్యులు అంటున్నారు. ప్రాణాపాయం కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. విజయవాడలో తొలిసారిగా ఇద్దరు కొవిడ్ బాధితులకు గురువారం ఈ కాక్‌టెయిల్ యాంటీబాడీస్ అందించారు. కరోనా చికిత్సలో ఈ కాక్‌టెయిల్ యాంటీబాడీస్ ప్రామాణికతను ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ కె.గోపాలకృష్ణ ముఖాముఖిలో వివరించారు.
ఇవీ చదవండి:
వైరల్: పోలీస్‌ను చితకబాదిన గ్రామస్థులు
Rare treatment: నవజాత శిశువుకు.. కోవిడ్ మల్టీ సిస్టమ్ సిండ్రోమ్ చికిత్స