ETV Bharat / state

ONLINE CLASSES: ప్రత్యక్ష తరగతులు వాయిదా..తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం - ts offline classes news

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పాఠశాలల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. కొన్నాళ్ల పాటు ఆన్​లైన్​ తరగతులను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు  సీఎంని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రతిపాదనకు ఆయన ఒప్పుకున్నారని జులై 1 నుంచి ఆన్​లైన్​ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వారు వెల్లడించారు.

CM KCR decision to postpone offline classes in the state
తెలంగాణ సీఎం కేసీఆర్
author img

By

Published : Jun 26, 2021, 7:24 PM IST

కొవిడ్​ మహమ్మారి కారణంగా తెలంగాణలో మూతబడిన బడులను తెరిచే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాఠశాలల్ని త్వరగా పునఃప్రారంభించాలన్న సమాచారం పెద్దఎత్తున కలకలం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ పాఠశాలల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు సీఎం కేసీఆర్​ను కలిసి కొన్ని రోజుల పాటు ప్రత్యక్ష తరగతులను వాయిదా వేయాలని, కొన్నాళ్లపాటు ఆన్​లైన్​ తరగతులు కొనసాగించాలని కోరారు. రోజుకు సగం మంది ఉపాధ్యాయులే హాజరయ్యేలా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు.

ప్రత్యక్ష తరగతులు వాయిదా వేస్తామని.. జులై 1 నుంచి ఆన్​లైన్​ బోధనకు సీఎం అంగీకారం తెలిపారని వారు వెల్లడించారు. పాఠశాలల ప్రారంభంపై తొందరలేదని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు. రోజూ సగం మంది ఉపాధ్యాయులే విధులకు హాజయ్యేందుకు సీఎం అంగీకరించారని ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Katti Mahesh: నెల్లూరు ఆస్పత్రిలో కత్తి మహేష్​కు చికిత్స.. తల, కళ్లకు తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.