ETV Bharat / state

మాస్క్​ల తయారీకి వస్త్రం కొరత - ఆగిరిపల్లి మండలంలో మాస్కుల పంపిణీ

కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు అందజేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకోసం వెలుగు, మెప్మా అధికారులకు మార్గనిర్దేశాలు ఇచ్చింది. మాస్కుల పంపిణీ ఉద్దేశం మంచిదే అయినా... కొన్ని కారణాలతో ఇంకా మాస్కుల పంపిణీ లక్ష్యం నెరవేరలేదు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది.

మాస్క్​ల తయారీకి వస్త్రం కొరత
మాస్క్​ల తయారీకి వస్త్రం కొరత
author img

By

Published : Jun 29, 2020, 9:41 PM IST

కరోనా కట్టడికి ప్రతి వ్యక్తికి ఉచితంగా మూడు మాస్క్​లు చొప్పున అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెలుగు, మెప్మా అధికారులను ఆదేశించింది. ఉద్దేశం బాగున్నా వివిధ కారణాలతో ఇప్పటివరకు లక్ష్యం నెరవేరలేదు. కరోనా విజృంభిస్తున్న వేళ కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో అందరికీ మాస్క్​లు అందలేదు.

  • 1.60 లక్షలు లక్ష్యం

ఆగిరిపల్లి మండలంలో 1.60 లక్షల మాస్క్​లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆప్కో నుంచి తీసుకున్న వస్త్రంతో మాస్కులను కుట్టే బాధ్యతను స్వయం సహాయసంఘాల్లోని మహిళలకు అప్పగించారు. వారు అందుబాటులో ఉన్న వస్త్రంతో 63 వేల మాస్కులను మాత్రమే సిద్ధం చేశారు. 25 గ్రామ పంచాయతీలకు గాను 8 గ్రామాల్లో మాత్రమే పంపిణీ చేశారు. 17 గ్రామాల్లో ఇంకా పంపిణీ చేయాల్సిఉంది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో త్వరితగతిన మాస్క్​లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

  • కొనాలంటే...

పేదలు మాస్కులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారు. మార్కెట్​లో రూ.20 నుంచి రూ.30 వరుకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. అయినప్పటికి నాణ్యత ఉండకపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనపర్చడం లేదు.

  • సరఫరాలో అంతరాయం

లాక్​డౌన్​ వల్ల వస్త్రం సరఫరా లేక 63 వేల మాస్కులను మాత్రమే సిద్ధం చేశాం. ఇంకా లక్ష మాస్కులకు వస్త్రం కొరత ఉంది. ---బి.రామకృష్ణ, ఏపీఎం, ఆగిరిపల్లి

  • త్వరలో అందజేస్తాం

తొలుత మండల సరిహద్దు గ్రామాల్లో పంపిణీ చేశాం. త్వరలో మిగిలిన గ్రామాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. ---పి.భార్గవి, ఎంపీడీవో, ఆగిరిపల్లి

ఇదీ చదవండి : 'మంత్రి బొత్స సోదరుడు మా భూమిని ఆక్రమిస్తున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.