ప్రభుత్వం, డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియో ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్ తెలుగు అలెర్ట్‌పై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కామన్ మాన్ ఫైర్స్ అని ఓ వీడియోను తెలుగు అలెర్ట్‌లో అప్లోడ్ చేశారని విజయవాడ న్యాయవాది బి.శ్రీనివాసరావు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు వీడియోను యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏడీజీ ఆదేశాలతో..
డీజిపీ, సర్కార్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ.. యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేశారని లేఖలో వివరించారు. ఛానల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆదేశాలతో సీఐడీ అధికారులు సదరు యూట్యూబ్ ఛానల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.