కృష్ణాజిల్లాలో ఈ ఏడాది అధిక వర్షాలు..అధిక ఉష్ణోగ్రతలు రెండూ మిర్చి పంట సాగుకు అడ్డంకులుగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు నాటిన మొక్కలు చనిపోయాయి. రైతుల డిమాండ్‌కు తగినంత నారు సరఫరా చేయలేక నర్సరీలు సైతం చేతులెత్తేశాయి. సొంతంగా పెంచిన నారు అధిక వర్షాలకు సగం మేర నాశనమైంది. దీంతో రైతులు అధిక ధరలకు గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఎకరాకు రూ.30 నుంచి 40 వేల వరకు అదనపు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. రైతుల అవసరాలను గుర్తించిన కొందరు దళారులు, వ్యాపారులు మిర్చి నారు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మిర్చి నారు ధరలు పెంచిన నర్సరీల నిర్వాహకులపై ఉద్యానశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: కప్పలదొడ్డి ఆంజనేయ ఆలయం హుండీ చోరీ.... గంటలోనే దొంగలు అరెస్ట్