ETV Bharat / state

బడీడు బాలలు... పనికి దగ్గర... చదువుకు దూరం

author img

By

Published : Nov 14, 2019, 9:21 PM IST

దేశం ఎంతా అభివృద్ధి చెందుతున్నా... చితికిపోయిన బాల్యాన్ని చూస్తే తెలుస్తుంది మన స్థితి ఏంటని.! ఆడుకోవాల్సిన తరుణంలో... కుటుంబ బాధ్యతను భుజానెత్తుకొని జీవిస్తున్న పిల్లలెందరో... ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరాగా... ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా... అవి ఆశించిన ఫలితం ఇవ్వడంలేదు. ఫలితం... బడీడు బాలలు పనికి దగ్గరవుతున్నారు... పాఠశాలకు దూరమవుతున్నారు. వారిని బడులకు నడిపించే పథకాలు, ప్రయత్నాలు ఎలా ఉన్నాయో... మోపిదేవి మండలంలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది.

నదిలో థర్మకోల్ పడవ నడుపుతున్న చిన్నారి
పసిశోకాల వెనుక పాపాలెవరివి?

కృష్ణా జిల్లాలో మోపిదేవి మండలంలోని ఆలయాల ముందు భిక్షాటన చేస్తూ... పిల్లలెందరో ఉంటారు. వారిని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు చూసినా పట్టించుకోరు. మోపిదేవి మండలంలోని అవనిగడ్డ రోడ్డు, కోసూరువారిపాలెం, రావివారిపాలెం, నాగాయతిప్పలో చిన్నారులు ఎక్కువగా రోడ్లమీద బతుకులీడుస్తారు.

కృష్ణానది తీరాన గుడిసెలు వేసుకుని నదిలో చేపలు పట్టుకుంటూ... సుమారు 100 మంది వరకు చిన్నారులు దుర్భర జీవనం సాగిస్తున్నారు. కోడూరు మండలం ఉల్లిపాలెం కరకట్టు మీద, పాలకాయతిప్ప బీచ్, కరకట్ట కింద, నాగాయలంక మండలం సోర్లగొంది, గుల్లలమోద, నాలి, నాగాయలంకలో చిన్నారులు బాల్యానికి దూరమవుతున్నారు.

6 నెలల క్రితం చైల్డ్​వెల్ఫేర్ కమిటీ... బాలల సంక్షేమ శాఖ, చైల్డ్​లైన్, అవనిగడ్డ పోలీసులు సంయుక్తంగా ఇలాంటి వారందర్నీ... గుర్తించారు. అనాథాశ్రమాల్లో చేర్చారు. ఇంకొందరిని బడికి పంపించారు. తర్వాత పట్టించుకోవడంలేదు. ఆకలితో పోరాడలేక... మళ్లీ వారు పనికి వెళ్తున్నారు. తమకు ఉపాధి చూపితే... పిల్లలను బడికి పంపుతామని చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీచూడండి.ప్రతిభ ఉంటే... పేదరికం అడ్డుకాదు..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.